అనపర్తి బ్రహ్మంగారి గుడిలో శాస్త్రోక్తంగా మొదలైన బ్రహ్మాండ కళ్యాణోత్సవ సంబరాలు

రిపోర్టర్: Devendra Reddy స్థలం: అనపర్తి

అనపర్తి కెనాల్ రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద 53వ కళ్యాణ మహోత్సవం నిమిత్తం వై.బి.యస్. ఆచార్యుల దంపతులచే ఘనంగా పందిరిరాట వేశారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 19 నుండి 29 వరకు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సంఘ అధ్యక్షులు పోలేపల్లి వెంకట లక్ష్మణరావు కోరారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.