తుపాన్ ధాటికి కొండెక్కిన రాకపోకలు దారకొండ రహదారి ధ్వంసం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలకు దారకొండ, గుమ్మిరెవుల మధ్య కొంగపాకలు వెళ్లే మార్గంలో రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ మార్గంలో బస్సులు ముందుకు వెళ్లలేక వెనుదిరుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు తీవ్రంగా కోరుతున్నారు.