ఉపాధ్యాయుల జోలికి వస్తే దబిడిదిబిడేనంటూ జగన్‌పై లోకేష్ ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాఠాలు చెప్పే టీచర్లంటే మాజీ సీఎం జగన్‌కు ఎందుకు అంత కక్ష అని మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో నిలదీశారు. మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఉపాధ్యాయుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, జగన్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబుపై ఒక్క ఆరోపణనైనా నిరూపించగలరా అని ప్రశ్నిస్తూ, తమ కుటుంబం నీతి నిజాయితీలతో బతికిందని స్పష్టం చేశారు.