కోర్టు అనుమతులు రాగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణంటూ మంత్రి నారాయణ స్పష్టత
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
కోర్టుల నుంచి అనుమతులు రాగానే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో అధికారుల పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. న్యాయస్థానాల తీర్పుల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.