నిరుద్యోగులకు గుడ్ న్యూస్: పీజీ విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం

రిపోర్టర్: నరేష్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్లో పీజీ చదవాలనుకుంటున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కాలానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్కాలర్షిప్ కింద ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల చొప్పున ఏడాదిలో పది నెలల పాటు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దేశవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా పది వేల మందిని ఎంపిక చేయనుండగా, యువతులకు ముప్పై శాతం వాటా కేటాయించారు.