భక్తులతో కిటకిటలాడుతున్న భిక్కనూరు అనంత పద్మనాభ స్వామి ఆలయం
రిపోర్టర్: రమేష్
స్థలం: భిక్కనూరు
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం చతుర్దశిని పురస్కరించుకుని ముస్తాబైంది. శుక్రవారం ఉదయం నుంచి సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, అనంత కోటి వత్తులు ముట్టించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ సహా అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశారు.