ఆసియా కప్ ఫైనల్స్ లోకి శ్రీలంక ప్రవేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
మహిళల ఆసియా కప్ రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని లంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్షిత సమరవిక్రమ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ విజయంతో వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన శ్రీలంక, ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్‌తో తలపడనుంది.