ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నాహాలు: మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Washington
ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. మరోవైపు ఈ పరిణామాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ తమపై దాడులకు పాల్పడితే అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన ప్రతిదాడికి దిగుతామని ఆ దేశ భద్రతాధికారి మోహ్సేన్ రెజాయ్ హెచ్చరించినట్లు డ్రాప్ సైట్ కథనం పేర్కొంది.