యువతకు వ్యవసాయంపై అవగాహన కల్పించిన పర్యటన

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని విద్యార్థులు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో విద్యార్థులు నూతన వ్యవసాయ పద్ధతులు, సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలపై నిపుణులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు.