శ్రీకాకుళం జిల్లాలో రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొని నలుగురు యువకులు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిసర ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాల వెంట నడుస్తున్న ఐదుగురు యువకులను రాజధాని ఎక్స్ప్రెస్ రైలు వేగంగా ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బహిర్భూమికి వెళ్లేందుకు రైల్వే ట్రాక్ సమీపానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ దవాఖానాకు పంపించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.