ఖమ్మం జీజీహెచ్లో బయోమెడికల్ వ్యర్థాల సురక్షిత నిల్వ కోసం శరవేగంగా షెడ్ నిర్మాణం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో బయోమెడికల్ వ్యర్థాలను సురక్షితంగా నిల్వ చేసి, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైద్య వ్యర్థాల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా ఈ చర్యలు చేపట్టారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.