తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ప్రజాగ్రహం తప్పదు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే బీజేపీ విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం మోత్కూర్ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో అమరవీరుల స్తూపాలకు నివాళులర్పించారు. చరిత్రతో సంబంధం లేని వారు దానికి మతం రంగు పులిమి వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు.