డబ్ల్యూడబ్ల్యూఈలో సరికొత్త టోర్నమెంట్: జాన్ సెనా క్లాసిక్ ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
ప్రముఖ రెజ్లింగ్ సంస్థ డబ్ల్యూడబ్ల్యూఈలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాన్ సెనా క్లాసిక్ టోర్నమెంట్ను డిసెంబర్ 14న నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ స్టార్ రెజ్లర్ జాన్ సెనా ప్రకటించారు. డిస్నీ వరల్డ్ లోని ఈఎస్పీఎన్ కాంప్లెక్స్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఈ, ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ల మధ్య జరిగే ఈ పోటీల్ లో విజేతకు సరికొత్త ఛాంపియన్షిప్ బెల్ట్ అందిస్తామని, క్లబ్ డబ్ల్యూడబ్ల్యూఈ సభ్యులు మాత్రమే యాప్ ద్వారా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు.