మణికొండలో దారుణం: కోకాపేటలో ఓయూ విద్యార్థి వెంకన్న హత్య కలకలం

రిపోర్టర్: వెంకట్ స్థలం: మణికొండ

నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట నియోపోలీస్ సమీపంలో ఓయూ పీహెచ్డీ విద్యార్థి వెంకన్న దారుణ హత్యకు గురైనట్లు మాదాపూర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. యాదవ సంఘ భవనం ముందు తలపై తీవ్ర గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్రికెట్ బ్యాట్తో దాడి చేసి ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్తో దర్యాప్తును ముమ్మరం చేశారు.