యూకే వీసాల పేరుతో భారీ మోసం చేసిన యూట్యూబర్ దంపతులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగులను మోసగించి కోట్ల రూపాయలు వసూలు చేసిన యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్లపై సీఎం ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేసి నకిలీ పత్రాలు సమర్పించడంతో యూకే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రజావాణి అధికారులు రాష్ట్ర డీజీపీతో పాటు ఈడీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.