గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై గోధుమకుంట వద్ద అధికారుల పరిశీలన

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ వలిగొండ అంజనేయులు, సీఐ మాదాస్ శంకర్, ఎస్హెచ్ఓ ఉదయ్ కిరణ్ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా బారికేడ్లు, క్రేన్లు, లైటింగ్ తదితర వసతుల కల్పనపై చర్చించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చైర్పర్సన్ తెలిపారు.