భారీ వరద నీటితో కృష్ణా నదికి జలకళ సంతరించుకున్న వైనం
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి సుమారు యాభై ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం తాకిందని వారు వెల్లడించారు. బ్యారేజీ వద్ద పన్నెండు అడుగుల నీటిమట్టం ఉందని, మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నామని చెప్పారు. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.