బైక్ ప్రియులకు తీపి కబురు: మార్కెట్లోకి కొత్త కవాసకి Z300 లాంచ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

భారత మార్కెట్లో తన జెడ్ సిరీస్ను మరింత విస్తరించేందుకు ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇండియా సిద్ధమైందని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. నింజా 300 ఆధారంగా అత్యాధునిక హంగులతో రూపొందించిన కవాసకి జెడ్ 300 మోడల్ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ మోటార్సైకిల్ శక్తివంతమైన ఇంజిన్ తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్నట్లు తెలిపారు.