బీఆర్ఎస్ భూదోపిడీపై త్వరలోనే దండయాత్ర చేస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కరీంనగర్

సిద్దిపేట భూముల వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం సహా భూములు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. త్వరలోనే బీఆర్ఎస్ భూ దోపిడీపై దండయాత్ర చేసి, ఆ భూముల్లో కాషాయ జెండాలు పాతి పేదలకు పంచుతామని ఆయన స్పష్టం చేశారు.