వెస్టిండీస్తో తొలి వన్డే బరిలోకి దిగేందుకు గిల్ ఫిట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరువనంతపురం

వెస్టిండీస్తో ఆదివారం జరగనున్న తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. ప్రాక్టీస్ సెషన్లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి తగలడంతో గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే గిల్ కోలుకుని మ్యాచ్కు సిద్ధంగా ఉన్నాడని కోటక్ స్పష్టం చేయడంతో టీమిండియా శిబిరంలో ఊరట లభించింది. తిరువనంతపురం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.