కనకాంబరం సాగుతో సిరులు: చిన్న రైతులకు నమ్మకమైన ఆదాయ వనరుగా పూల పంట
రిపోర్టర్: మహేష్
స్థలం: గుంటూరు
సాంప్రదాయ పూల సాగులో కనకాంబరం రైతులకు అద్భుతమైన ఆదాయాన్ని అందిస్తోందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన రైతు రాంబాబు తెలిపారు. కేవలం ఇరవై ఐదు సెంట్ల భూమిలో ఈ సాగును చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో పూలకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందని, తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా లాభాలు సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు.