రాగి పాత్రల్లో ఈ పానీయాలు అస్సలు పోయకండి: ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

రాగి పాత్రల వాడకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే నిమ్మరసం, మజ్జిగ, పాలు మరియు వేడి టీ వంటి ఆమ్ల లేదా వేడి పానీయాలను రాగి పాత్రల్లో ఉంచితే తీవ్రమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుందని వారు హెచ్చరించారు. దీనివల్ల కాపర్ పాయిజనింగ్ ఏర్పడి పొట్టలో మంట, వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని, కాబట్టి వీటిని రాగి పాత్రల్లో అస్సలు పోయకూడదని నిపుణులు స్పష్టం చేశారు.