విజయవాడలో అక్టోబర్ ఎనిమిది నుంచి జాతీయ స్థాయి సరస్ మేళా

రిపోర్టర్: రాజేష్ స్థలం: గుంటూరు

విజయవాడలో అక్టోబర్ 8 నుంచి జాతీయ స్థాయి ‘సరస్ మేళా’ను నిర్వహించనున్నట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళా స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకునేందుకు ఈ మేళా ఒక గొప్ప మార్కెటింగ్ వేదికగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మార్కెటింగ్, బ్రాండింగ్పై అవగాహన కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.