నీటి కొరత వేళ తాజ్ ప్యాలెస్లో విందులా: రేవంత్ రెడ్డిపై తెలుగు స్కైబ్ మండిపాటు

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణలో తీవ్ర నీటి కొరతతో పాటు కరెంట్ కోతలతో రైతాంగం అష్టకష్టాలు పడుతుంటే, తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో కోట్ల రూపాయల ప్రజాధనంతో విందులు, వినోదాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై Telugu Scribe తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు కన్నీరు కారుస్తుంటే ప్రభుత్వం మాత్రం విలాసాలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరికాదని విమర్శించారు.