తిరుమల బ్రహ్మోత్సవాల్లో విదేశీ కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు

రిపోర్టర్: శివ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింగపూర్ నుంచి 32 మంది, జర్మనీ నుంచి 13 మంది కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరాయి దేశాల్లో ఉంటున్నా మాతృభూమి సంస్కృతిని వీడకుండా పిల్లలకు భారతీయ కళలను నేర్పిస్తున్నామని, గరుడసేవ రోజు తిరుమల మాడవీధుల్లో నృత్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కళాకారులు తెలిపారు.