ఫ్రీజర్లపై సైబర్ దాడుల కలకలం: ఆహార నిల్వలను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు
రిపోర్టర్: హరి
స్థలం: అంతర్జాతీయం
ఆహార పదార్థాలను నిల్వ ఉంచే ఫ్రీజర్లపై హ్యాకర్లు ముమ్మరంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు. అమెరికాలోని సైనిక స్థావరాలు మొదలుకొని యూరప్ దేశాల సూపర్ మార్కెట్ల కూలింగ్ వ్యవస్థల రిమోట్ యాక్సెస్‌ను హ్యాక్ చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఆహార కొరత సృష్టించడంతో పాటు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.