అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా నూతన విద్యార్థుల పరిచయ వేదిక

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: మాకవరపాలెం

అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల పరిచయ వేదిక మరియు ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సును పరిమితంగా వాడుకోవాలని, లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలని వక్తలు సూచించారు.