విశాఖపట్నంలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
రిపోర్టర్: మహేష్
స్థలం: విశాఖపట్నం
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది. ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు విశాఖ కలెక్టరేట్, జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్, భీమిలీ, ఆర్డీవో కార్యాలయాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో ప్రత్యేక నంబర్లను సంప్రదించాలని సూచించారు.