హైదరాబాద్లో భారీ ఎలివేటెడ్ కారిడార్: నాలుగు కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సీఎల్ కూడలి వరకు నాలుగు కిలోమీటర్లకు పైగా ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ లేకుండా వాహనాలు రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.