విద్యార్థులకు పోలీస్ శాఖ సేవలపై అవగాహన: ఓపెన్ హౌస్ కార్యక్రమం
రిపోర్టర్: సురేష్
స్థలం: జగిత్యాల
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు SP JAGTIAL వెల్లడించారు. ఈ వేదికగా పోలీస్ శాఖ పనితీరు, ఎఫ్ఐఆర్ నమోదు విధానం, సీసీ కెమెరాల పనితీరు, ఆయుధాల వినియోగం, డయల్ 112 అత్యవసర సేవలు, షీ టీమ్స్ బాధ్యతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం మరియు అమరవీరుల త్యాగాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిపారు.