జైలు నుంచి విడుదలైన నటుడు రోహిత్ చండేల్
రిపోర్టర్: శివ
స్థలం: మహారాష్ట్ర
పోక్సో కేసులో అరెస్టై రెండు నెలల పాటు జైలులో ఉన్న టెలివిజన్ నటుడు రోహిత్ చండేల్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన విడుదలపై సహనటి మదిరాక్షి ముండ్లే భావోద్వేగ నోట్ రాశారు. తాను పడ్డ కష్టాలనుంచి బయటపడి రోహిత్ తిరిగి ఇంటికి చేరుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, సిబ్బందికి రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.