అమ్రోహాలో హర్యానా మహిళపై సామూహిక అత్యాచారం నలుగురు అరెస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: Amroha

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో హర్యానాకు చెందిన యువతిపై ఇద్దరు పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. హసన్‌పూర్ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ఎస్సై సంజయ్ తోమర్, హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మోహిత్, హెడ్ కానిస్టేబుల్ లాలారామ్ యాదవ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.