నా కాపురం కూల్చుతున్నారంటూ గోవింద భార్య సునీత ఆవేదన

రిపోర్టర్: రాజేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ నటుడు గోవిందతో తన వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన సతీమణి సునీత అహుజా ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది రాక్షసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఎలాంటి కారణం లేకుండానే తన ఇల్లు కూలిపోతోందని, యువత తనకు మద్దతుగా నిలవాలని సునీత కన్నీటిపర్యంతమయ్యారు.