బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఖమ్మం

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. విచ్చలవిడి అప్పుల కారణంగా భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమాన్ని విస్మరించమని, రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.