పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ఖమ్మం కలెక్టర్ దివాకర సమీక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల నమోదును మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.