మహబూబ్నగర్ జిల్లాలో నెల రోజుల పాటు ముప్పై పోలీసు యాక్ట్ అమలు

రిపోర్టర్: హరి స్థలం: మహబూబ్‌నగర్

శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి ఈనెల 31వ తేదీ సాయంత్రం వరకు నెల రోజుల పాటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ముప్పై పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, అత్యవసర సమయాల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.