బీహార్ లో మైనర్ విద్యార్థిని వేధింపులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: బీహార్
బీహార్ లోని జమూయి జిల్లాలో ఇద్దరు మైనర్ పదవ తరగతి విద్యార్థులను కొంతమంది మూకలు బహిరంగంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తూ బీహార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధితురాలు చేతులు జోడించి వేడుకుంటున్నా కనికరించని దుండగుల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.