మనుబోలును వైసిపి పాలన సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తిన పొట్టేళ్ల ప్రసాద్

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా చెట్లకొండూరులో కూటమి నాయకులు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి పాలనలో మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.