కుండపోత వర్షంతో అతలాకుతలమైన నెల్లూరు నగరం రోడ్లు జలమయం
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం గంటపాటు పడింది. మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ అకస్మిక వర్షంతో నగర వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజువారీ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు వెల్లడించారు.