వైద్య రంగానికి కొత్త ఊరట: ఐదు డాలర్లతోనే వ్యాక్సిన్ పరికర రూపకల్పన

రిపోర్టర్: నరేష్ స్థలం: লండন

వ్యాక్సిన్ల రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు నలుగురు విద్యార్థులు కేవలం ఐదు డాలర్ల ఖర్చుతో ప్రత్యేక పరికరాన్ని రూపొందించినట్లు ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు తెలిపారు. విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ పరికరం ద్వారా టీకాలు గడ్డకట్టుకుపోవడాన్ని గుర్తించవచ్చని, తద్వారా వైద్య సిబ్బందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ నూతన ఆవిష్కరణకు గాను ఆ విద్యార్థుల బృందం ఏడు వేల పౌండ్ల నగదు బహుమతిని గెలుచుకుందని వివరించారు.