'సకాలంలో స్పందించి పెను ప్రమాదం తప్పించాం': బోగోలు రైల్వే ఘటనపై అధికారులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని శ్రీవెంకటేశ్వరపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం గూడ్సు రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బిట్రగుంట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్సు రైలు వ్యాగన్ చక్రం వద్ద మంటలు చెలరేగడాన్ని ఓ రైల్వే ఉద్యోగి గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి బ్రేకుల రాపిడి కారణంగానే మంటలు వచ్చినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు.