యాసిన్ మాలిక్ సహా ఏడుగురిపై మనీలాండరింగ్ ఛార్జీలు నమోదు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: దిల్లీ
పాకిస్థాన్ నుంచి హవాలా మార్గాల ద్వారా విదేశీ నిధులు సేకరించిన కేసులో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాద సంస్థ చీఫ్ యాసిన్ మాలిక్ తో పాటు మరో ఆరుగురు వేర్పాటువాద నేతలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఛార్జీలు నమోదు చేయాలని దిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నిందితులపై బలమైన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ విచ్ఛిన్నకర కార్యకలాపాల కోసం రూ. 8.9 కోట్లకు పైగా నేరపూరిత నిధులు చేతులు మారినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.