తీవ్ర తుఫాను ముప్పు: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న ఆర్నాబ్ తుఫాను హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh / Telangana
బంగాళాఖాతంలో ఆర్నాబ్ పేరుతో తీవ్ర తుఫాను ముప్పు ముంచుకొస్తోందని స్కైమెట్ వెదర్ (Skymet Weather - వ్యవసాయ వాతావరణ అంచనాలు & వర్షపాతం) హెచ్చరించింది. ఈ మేరకు అక్టోబర్ 27 నాటికి ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అన్నదాతలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.