దిల్లీ నిరసనలపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం: వినోద్ బన్సల్ మండిపాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జరుపుతున్న ఆందోళనలపై విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసనల ముసుగులో ప్రధాన మార్కెట్లను దిగ్బంధించి చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీల జీవనోపాధిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని శనివారం ఆయన ఆరోపించారు. పండగల సమయంలో ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని బన్సల్ స్పష్టం చేశారు.