జైలు జీవితాన్ని సద్వినియోగం చేసుకుని డిగ్రీలో బంగారు పతకం సాధించిన ఖైదీ

రిపోర్టర్: గోపి స్థలం: राजमहेंद्रवरम्

తప్పులను సరిదిద్దుకుని జైలు జీవితాన్ని సద్వినియోగం చేసుకున్న పోక్సో కేసు ఖైదీ ఎన్.సురేష్ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలంకకు చెందిన సురేష్, 2020 నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు అధికారుల సహకారంతో సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా బీఏ పూర్తిచేసి బంగారు పతకానికి అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో ఈ నెల 7న జరిగే స్నాతకోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.