పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ ఆరు తర్వాత కూడా అవకాశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

నవంబర్ ఆరు తర్వాత కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.