పాకిస్తాన్ ఉగ్రవాద బుర్ఖా బట్టబయలు చేస్తామంటూ భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: New York
ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ, పాకిస్తాన్ పగటిపూట శాంతి వచనాలు పలుకుతూ రాత్రివేళల్లో ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, దీనిపై ఎలాంటి రాజీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఆ దేశపు ద్వంద్వ వైఖరిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని పేర్కొన్నారు.