టీఎన్జీవోస్ వైపు కదంతొక్ కి భారీగా సభ్యత్వం తీసుకున్న కన్నెపల్లి ఉద్యోగులు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

కన్నెపల్లి మండలంలో సోమవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఇరవై ఐదు మంది ఉద్యోగులు నూతనంగా టీఎన్జీవోస్ సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు. బెల్లంపల్లి యూనిట్ కార్యదర్శి ఎంబడి క్రాంతికుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.