అమెరికా హెచ్-1బీ వీసాల నిబంధనలపై ఉలిక్కిపడ్డ ప్రవాస భారతీయులు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో భారతీయ టెక్ ఉద్యోగుల్ లో తీవ్ర ఆందోళన నెలకొందని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా హెచ్చరించారు. వీసా పిటిషన్లపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం, లాటరీ విధానాన్ని మార్చడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు విదేశీ నిపుణుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.