ఏలేరు జలాశయానికి పోటెత్తుతున్న వరద పెరుగుతున్న నీటిమట్టం

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ఏలేశ్వరం

ఏలేరు రిజర్వాయర్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 79.65 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం 13.04 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 18,651 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 250 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఏలేశ్వరంలో 56.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయానికి ఇన్ ఫ్లో క్రమేపి పెరుగుతోంది.